ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఘన ఆహ్వానం

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రభుత్వం ఆహ్వానించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పలు రాష్ట్రాల సీఎంలను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ ఏడాది పది రోజుల పాటు అమ్మవారు విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ముగింపు రోజున కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.