స్వామి సమర్థ ఆలయంలో వెండి పాదుకలు చోరీ, ఇద్దరి అరెస్ట్
రిపోర్టర్: నరేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని ఖాలాపూర్ శ్రీ స్వామి సమర్థ ఆలయంలో సెప్టెంబర్ 2న జరిగిన వెండి పాదుకల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పుణేలో నిందితులు మహేంద్రసింగ్ రాథోడ్, రవి సోనీలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన వెండి పాదుకలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా శుక్రవారం వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేశారు.