గిరిజనుల బతుకులను వెన్నాడుతున్న భూ సమస్యల పరిశీలన
రిపోర్టర్: SK
స్థలం: పెద్దపల్లి
రామగుండం మండలం ఎనిమిదో ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్‌నగర్ లంబాడి తండాలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. సుమారు యాభై ఏళ్లుగా నివాసం ఉంటున్న గిరిజనుల భూ సమస్యలు, రికార్డులను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యల పరిష్కారం కోసం సింగరేణి సీఎండీకి లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.