'సాక్షి గూండాయిజం.. మాజీ సైనికుడిని వేధిస్తున్నారు': వైయస్ జగన్ మీడియాపై కూటమి నేతల మండిపాటు
రిపోర్టర్: సతీష్
స్థలం: Amaravati
పారదర్శకంగా జరిగిన డీఎస్సీ ప్రక్రియపై బురదజల్లేందుకు సాక్షి మీడియా ప్రయత్నిస్తోందని నేతలు తీవ్రంగా ఆరోపించారు. మాజీ సైనికుడు, ఉపాధ్యాయుడిపై సాక్షి గూండాయిజానికి పాల్పడుతూ పాఠశాలల్లోకి చొరబడి వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. పాత్రికేయ ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్నారని, మెగా డీఎస్సీ టీచర్లను టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.