2027 నాటికి పోలవరం తొలి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
రిపోర్టర్: గోపి
స్థలం: ఏలూరు
ఐదు కోట్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణాన్ని 2027 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇవాళ ఆయన పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు తుది దశకు చేరుకున్నాయని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మంత్రి విమర్శించారు.