రైతు గర్జన సభకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు: కాంగ్రెస్ పై కేటీఆర్ మండిపాటు
రిపోర్టర్: విజయ్
స్థలం: మంచిర్యాల
కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్రంగా మోసపోయిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఆదిలాబాద్ లో కేటీఆర్ నిర్వహిస్తున్న రైతు గర్జన సభకు మంచిర్యాల జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లినట్లు నాయకులు తెలిపారు. మద్దతు ధర, విత్తనాలు, సాగునీరు, రైతు భరోసా అందక రైతులు అల్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించే ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.