దర్శకుడిగా విజయ్ వారసుడు జేసన్ సంజయ్ టాలీవుడ్ ఎంట్రీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

కోలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సిగ్మా చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన తండ్రి విజయ్ అందించిన సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని, సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని జేసన్ సంజయ్ తెలిపారు.