రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం కర్ణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడా సమర్పణలో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా ఎపిక్ చిత్రం కర్ణ. మహాభారతంలోని మహావీరుడు కర్ణుడి జీవితగాథ ఆధారంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ వీఎఫ్ఎక్స్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.