సంక్రాంతి బరిలో సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు

రిపోర్టర్: సురేష్ స్థలం: India

మెగా హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'సంబరాల ఏటిగట్టు' డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ యాక్షన్ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం భారీ ఏర్పాట్లు చేస్తోంది.