బ్రహ్మపుత్ర నదిలో పాలు పోసి డబ్బా విసిరిన వ్యక్తి: సోషల్ మీడియాలో ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: Dibrugarh

అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నదిలో పూజ పేరుతో ఓ వ్యక్తి పాలు పోసి, ఖాళీ అట్ట డబ్బాను నదిలోనే విసిరిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిందని టెకీ నవీన్ రెడ్డి వెల్లడించారు. నమ్మకాల పేరుతో నదిని కాలుష్యం చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలచరాలకు ముప్పు వాటిల్లుతుందని, ప్రకృతిని కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.