టెన్షన్ను తరిమికొట్టే మార్గం ఇదేనంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వెల్లడి

రిపోర్టర్: సురేష్ స్థలం: Seattle

మానసిక ఒత్తిడిని అధిమించడానికి తొలి అడుగు వేయడమే ఏకైక మార్గమని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్పష్టం చేశారు. సమస్యలను విస్మరించకుండా వెంటనే పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించాలని ఆయన సూచించారు. సియాటెల్ మ్యూజియం వేదికగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఒత్తిడి అనేది ఏదో తప్పు జరుగుతోందనే సంకేతమని ఆయన పేర్కొన్నారు. తాను కూడా తొలి రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్నానని అమెజాన్ అధినేత ఈ సందర్భంగా తెలిపారు.