రూ.11085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Andhra Pradesh
ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో నిర్వహించిన పల్లె పండుగ మూడో విడత కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.11,085 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేసినట్లు సీఎంవో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా వెల్లడించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పల్లెల రూపురేఖలను మార్చేలా ఈ నిధులతో మౌలిక వసతులు, రహదారులు తదితర నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.