బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనపై ఎక్స్ లో వివాదాస్పద పోస్ట్ చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం పోలీసులను వాడుతోందని మండిపడ్డారు.