వివేకా హత్య కేసు విచారణలో సునీల్ యాదవ్ సంచలన విషయాలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: పులివెందుల
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈడీ విచారణ సందర్భంగా ఏ2 నిందితుడు సునీల్ యాదవ్ పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. హత్యకు సంబంధించి కుదిరిన సుపారీ ఒప్పందం, నిధులు సమకూర్చిన వ్యవహారంపై అధికారుల ఎదుట ఆయన పూర్తి వివరాలు అప్పగించినట్లు తెలుస్తోంది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరగా అధికారులు భద్రతా హామీ ఇచ్చినట్లు సమాచారం.