విశాఖ ఎయిర్పోర్ట్ సర్వీసులు: హైకోర్టు కీలక నిర్ణయంపై భోగాపురం బదిలీకి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సివిల్ విమాన కార్యకలాపాలను భోగాపురానికి మారుస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై జోక్యం చేసుకోలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ఎం. రామారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. భోగాపురానికి రవాణా సౌకర్యాలు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో, పిటిషనర్ల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.