జింబాబ్వేపై అద్భుత శతకంతో చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా

రిపోర్టర్: శివ స్థలం: World

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్‌షా అద్భుత సెంచరీతో చెలరేగాడు. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 94 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 109 పరుగులు సాధించి వన్డేల్లో తన తొలి శతకం నమోదు చేశాడు. టాపార్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.