ఏసీ బస్సుకు డబ్బులు తీసుకొని నాన్ ఏసీలో ప్రయాణం చేయించిన ట్రావెల్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

ఏసీ బస్సు పేరుతో డబ్బులు వసూలు చేసి నాన్ ఏసీ బస్సులో ప్రయాణం చేయించడంతో పాటు అర్ధరాత్రి నడిరోడ్డుపై దింపిన ట్రావెల్స్ సంస్థకు విశాఖపట్నం జిల్లా కన్స్యూమర్ కమిషన్ భారీ షాకిచ్చింది. బాధితుడికి నష్టపరిహారంగా రూ.31,500 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రయాణికుడికి సేవల విషయంలో లోపం తలెత్తడంతోనే ఈ తీర్పు వెలువడినట్లు కమిషన్ స్పష్టం చేసింది.