ఇజ్రాయెల్ లో ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు: రాజకీయ పార్టీలతో అధ్యక్షుడు సంప్రదింపులు
రిపోర్టర్: గోపి
స్థలం: జెరూసలేం
ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్ లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, దేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంటుకు ఎన్నికైన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. నెతన్యాహును పీఠం నుంచి దించేందుకు అరబ్ పార్టీలు సిద్ధమవుతున్నట్లు తాఅల్ పార్టీ అధినేత అహ్మద్ తీబీ స్పష్టం చేయడంతో, ఆ దేశ రాజకీయాల్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.