మనుబోలులో అంగన్వాడీల పర్యవేక్షణపై బీజేపీ నేతల దిశానిర్దేశం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు డిజిఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సేవా సంకల్ప సభలో మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులకు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యతపై ఆయన ఆరా తీశారు.
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు రామిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ నాయకులు అల్లా బాషా, ప్రధాన కార్యదర్శి సోలామయ్య తదితరులు పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు.