రాజకీయ కుట్రలు: మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారంటూ కిషన్ రెడ్డి ధ్వజం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ విమర్శలు కేవలం తాటాకు చప్పుళ్లు మాత్రమేనని కొట్టిపారేశారు. మోదీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందని, విపక్షాల పగటి కలలు ఎప్పటికీ సాకారడవని ఆయన తేల్చిచెప్పారు.