లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

రిపోర్టర్: సురేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గరివిడి పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో గుర్ల మండలానికి చెందిన బోడసింగి లక్ష్మణరావు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.