విషాదం: ఉమ్మడి ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి కన్నుమూత
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ ఏ. చక్రపాణి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం రాజకీయ మరియు శాసన వ్యవస్థలకు తీరని లోటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని నారా లోకేశ్ కొనియాడారు. ప్రముఖుల సంతాపం రాజకీయ వర్గాల్ లో తీవ్ర విషాదాన్ని నింపింది.