విశాఖలో కలకలం: అరవై లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

రిపోర్టర్: సురేష్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం మహారాణిపేట పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో లాడ్జీల్లో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు, నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అరవై లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు, డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తును మరింత ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.