అకాలీదళ్ నేత అమర్జిత్ సింగ్ చావ్లాపై అత్యాచార కేసు నమోదు

రిపోర్టర్: సతీష్ స్థలం: పంజాబ్

పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్‌లో ఎస్‌జీపీసీ సభ్యుడు, సీనియర్ అకాలీదళ్ నాయకుడు అమర్‌జిత్ సింగ్ చావ్లా తనను బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు బహ్రెయిన్‌లో ఉంటున్న సంగ్రూర్ జిల్లాకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఈ ఆరోపణలను చావ్లా ఖండించారు. మరోవైపు అకాల్ తఖ్త్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎస్‌జీపీసీ సమగ్ర విచారణకు ఆదేశించింది.