ములుగు జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

రిపోర్టర్: గోపి స్థలం: ములుగు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కోరారు. జిల్లా కలెక్టరేట్ తో పాటు ములుగు ఆర్డీవో కార్యాలయం, అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.