యువకుడిని బెదిరించి నగదు దోచుకున్న నటి వర్షిణి అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ప్యారిస్
యువకుడిని బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకున్న కేసులో బిగ్‌బాస్ ఫేమ్, నటి వర్షిణి వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షార్ట్‌ఫిలిం పెట్టుబడి పేరుతో మోసగించి, దాడికి పాల్పడి నగదు లాక్కొన్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వర్షిణిసహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.