పల్నాడులో అర్థరాత్రి ఘర్షణ: తెదేపా కార్యకర్తలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో అర్థరాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత తలెత్తిందని, తెదేపా శ్రేణులపై వైకాపా కార్యకర్తలు కర్రలతో దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.