ఆరోగ్యానికి తీపి కబురు: రోజుకు పది నిమిషాల వ్యాయామంతో హాయిగా నిద్ర

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

రోజూ కనీసం పది నిమిషాల పాటు మీడియం నుండి హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల రాత్రిపూట హాయిగా గాఢ నిద్ర పడుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదని, క్రమం తప్పకుండా పది నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తే శరీరంలో ఉష్ణోగ్రత మరియు అడినోసిన్ స్థాయిలలో మార్పులు వచ్చి మంచి నిద్ర మీ సొంతమవుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త అధ్యయన వివరాలను పరిశోధకులు తెలిపారు.