ఫరీదాబాద్లో దారుణం: తినుబండారాల బండి వద్ద వివాదం వ్యక్తి హత్య

రిపోర్టర్: గోపి స్థలం: ఫరీదాబాద్

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లో జరిగిన ఘోర ఘటనలో లక్ష్మణ్ అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. సెక్టార్ 62 వద్ద ఫాస్ట్ ఫుడ్ బండి వద్ద తినుబండారాల విషయమై జరిగిన చిన్న వాగ్వాదం ఘర్షణగా మారిందని, నిందితులు దాడి చేసి కత్తితో పొడవడంతో అతను మృతి చెందాడని అధికారులు తెలిపారు. అడ్డుబోయిన అతని మేనల్లుడు మహేష్ పై కూడా దాడి జరిగిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.