అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఈసారి శారీరక కొలతలు, దేహదారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షను కూడా తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు చేర్చినట్లు అధికారులు తెలిపారు.