'అభివృద్ధిని అడ్డుకుంటే భయపడేది లేదు': మంత్రి నారాయణ ఫైర్

రిపోర్టర్: సురేష్ స్థలం: నెల్లూరు

వైకాపా నాయకులు నెల్లూరు నగరంలో అభివృద్ధిని అడ్డుకుంటూ విమర్శలు చేసినా భయపడకుండా ప్రజలకు సేవ చేస్తామని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులోని పరమేశ్వర నగర్‌లో వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను ఆయన పరిశీలించారు. నగరంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని, జూన్ 12 నాటికి పాఠశాలను అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.