నిజామాబాద్ లో సర్వీస్ రివాల్వర్ శుభ్రం చేస్తుండగా ఆర్ఐ మృతి
రిపోర్టర్: హరి
స్థలం: నిజామాబాద్
నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ హెచ్. సతీష్ శుక్రవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలి దుర్మరణం చెందారు. ఎన్‌ఎస్‌ఐ విధులు ముగించుకుని హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న ఆయన వెపన్ క్లీన్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సీపీ సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనను ధ్రువీకరించారు. ఆర్ఐ అకస్మాత్ మృతితో జిల్లా పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి.