టీటీడీ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తే ఉపేక్షించేది లేదు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. స్వామివారి పవిత్ర భూములను ల్యాండ్‌బ్యాంక్‌గా పరిగణించకూడదని స్పష్టం చేశారు. తిరుమలలో గోమాంస విక్రయాలకు అనుమతి ఉన్న హోటళ్లకు చోటు కల్పించడం భక్తుల మనోభావాలను గాయపరుస్తోందని, కొన్ని అధికారులు వాణిజ్య అవసరాల కోసం కుట్ర పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.