మదనపల్లెలో ఉద్యాన హబ్ శంకుస్థాపన: ఏపీ అభివృద్ధిలో రిలయన్స్ భాగస్వామ్యం

రిపోర్టర్: సురేష్ స్థలం: మదనపల్లె

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ ఉద్యానహబ్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన అంబానీ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో తమ సంస్థ భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని తెలిపారు. ఐఏఎస్ఏ సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.