ట్రూల్స్‌కు సల్మాన్ ఖాన్ గట్టి కౌంటర్

రిపోర్టర్: రాము స్థలం: ఇండియా

బిగ్ బాస్ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో తన వయసు, ఫిట్‌నెస్ ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. అరవై ఏళ్ల వయసులోనూ తన క్రమశిక్షణను ప్రదర్శిస్తూ విమర్శకులకు షాకిచ్చారు. అలాగే నటీమణులపై పాపరాజీల అసభ్యకర ఫోటోగ్రాఫీ తీరును సల్మాన్ తీవ్రంగా ఖండించారు. ఈ ఎపిసోడ్‌ను ప్రశంసిస్తూ నటుడు కుశాల్ టండన్ సల్మాన్ అంకితభావాన్ని కొనియాడారు.