అంతర్జాతీయ ఉద్రిక్తతలు: హార్ముజ్ జలసమధి వద్ద అమెరికా డ్రోన్లను కూల్చేసిన ఇరాన్

రిపోర్టర్: రాము స్థలం: Hormozgan

హార్ముజ్ జలసమధి సమీపంలో తమ గగనతలంలోకి ప్రవేశించిన రెండు అమెరికా తయారీ డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ స్పష్టం చేసింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్ లోని బందర్ ఖమిర్ తీర ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి స్వతంత్ర ధ్రువీకరణ రాలేదు.