నెట్ఫ్లిక్స్లో రణబాలి ట్రూత్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ, రశ్మిక జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ రణబాలికి సంబంధించి మేకర్స్ ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. చరిత్రలో కనుమరుగు చేసిన నిజాలను వెలికితీసేలా నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ సిరీస్ రానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 28వ తేదీన తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుందని, రణబాలి ప్రపంచం నుంచి ఎక్స్క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్ ఈ సిరీస్లో ఉండనుందని తెలిపారు.