పదిహేను లక్షల ఆఫర్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుండి మిథిలేష్ అవుట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీగా అడుగుపెట్టిన మిథిలేష్ కేవలం ఒక్కరోజు మాత్రమే హౌస్లో ఉండి పదిహేను లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ను స్వీకరించి వెనుదిరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మిథిలేష్ నిష్క్రమణపై కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయని, కొందరు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టగా మరికొందరు సమర్థించారని వెల్లడించారు. ఈ పరిణామాల మధ్య హౌస్లో జరిగిన జంతువుల మెడల్ టాస్క్ తో పాటు నామినేషన్ల ప్రక్రియలో వివాదాలు తలెత్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.