పోలీస్ డ్రైవర్ పోస్టులలో హోంగార్డులకు పది శాతం కోటా
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో సేవలు అందిస్తున్న హోంగార్డుల సంక్షేమం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం ద్వారా భర్తీ చేసే పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులలో హోంగార్డులకు పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ జీవో జారీ చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ తీసుకొచ్చిన ఈ నూతన విధానం ద్వారా డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన హోంగార్డులకు పోలీస్ విభాగంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై హోంగార్డులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.