ఎల్ నినో పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్ పై లక్ష్మారెడ్డి మండిపాటు

రిపోర్టర్: రమేష్ స్థలం: మహబూబ్ నగర్

ఎల్ నినో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం అమ్మాపూర్ గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంటలు వేసుకున్న రైతులకు నీరు, కరెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తోందని మండిపడ్డారు. ఎండిన పంటలకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.