మాటూర్ గ్రామంలో ఘనంగా భగవాన్ బలరాం జయంతి వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూర్ గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో భగవాన్ బలరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా రైతులంతా ఒక్కటే అనే భావంతో ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతును సన్మానించి, వారి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సాదినేని రవీందర్, రావి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.