తుంగలంలో రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పల్లా
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
గాజువాక నియోజకవర్గం 69వ వార్డు తుంగలం గ్రామంలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. రామాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, జనసైనికులు భారీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.