పెద్దపల్లిలో ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితారాణి హత్య కేసులో లెక్చరర్ అరెస్ట్
రిపోర్టర్: వెంకట్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని తండ్ర అక్షితారాణి హత్య కేసులో ఆమె మాజీ లెక్చరర్ జెట్టి నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బొగ్గు గనిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో లైంగిక దాడికి గురైన విషయాన్ని తెలుసుకున్న నవీన్ కుమార్, సెప్టెంబర్ 12న విద్యార్థినితో బలవంతంగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చికిత్స పొందుతూ ఆమె సెప్టెంబర్ 13న మృతి చెందగా, ఈ ఘటనకు సంబంధించి ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.