విజయనగరం అభివృద్ధి కోసం జనసేన తరుపున బరిలో నిలుస్తున్న రేఖరాణి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను పరిష్కరించాలనే సంకల్పంతో జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు గుడిసెల రేఖరాణి తెలిపారు. పదవుల ఆశతో కాకుండా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా విజయనగరం పదిహేడవ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్లాసు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.