ఆంధ్రప్రదేశ్ కు దీపావళి కానుక: కేంద్రం నుండి నాలుగు వేల కోట్ల నిధులు విడుదల

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల పన్నుల వాటాను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసిన నిధులలో ఏపీకి ఈ భారీ మొత్తం దక్కిందని అధికారులు తెలిపారు. పండుగల సీజన్ లో మూలధన వ్యయం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల నిర్వహణకు ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.