హుస్సేన్‌సాగర్‌లో ఘనంగా ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహార మహాగణపతిగా భక్తులకు దర్శనమిచ్చిన గణనాథుడు శుక్రవారం మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ నాలుగు వద్ద ప్రత్యేక పూజల అనంతరం భారీ క్రేన్ల సాయంతో విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.