హర్యానాలో రిటైర్డ్ పోలీస్ అధికారి అనుమానాస్పద మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: హర్యానా
హర్యానాలోని సోనిపట్‌లో రిటైర్డ్ పోలీస్ అధికారి జై సింగ్ ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది. రూ. 22 లక్షల ఆర్థిక లావాదేవీల వివాదం, బెదిరింపుల కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్ వెల్లడైంది. మృతుడి కుమారుడు నితిన్ ఫిర్యాదు మేరకు సట్టా అనే వ్యక్తిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.