పాల్వాయి గ్రామంలో అంగరంగ వైభవంగా ముత్యాలమ్మ బోనాలు

రిపోర్టర్: వెంకటాపురం vishnu🙏 స్థలం: గుర్రంపోడ్

గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలతో గ్రామం సందడిగా మారింది. గ్రామ సుభిక్షం, రైతులకు మంచి పంటలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బైరెడ్డి సత్యనారాయణ, ఉపసర్పంచ్ మంచికంటి ప్రసాద్, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.