చికెన్ తిన్న వ్యక్తికి ప్రాణాపాయం, సెప్సిస్ బారిన పడిన వృద్ధుడు

రిపోర్టర్: అశోక్ స్థలం: World

బ్రిటన్‌లోని సర్రే ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల ఉధ్యమ్ అమిన్ పబ్‌ನಲ್ಲಿ రోస్ట్ చికెన్ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. క్యాంపైలోబ్యాక్టర్ బాక్టీరియా వల్ల ఆయనకు సెప్సిస్ సోకి, బహుళ అవయవాలు విఫలమయ్యాయి. గుండెపోటు కూడా రావడంతో వైద్యులు కొన్ని గంటలే బతుకుతారని తెలిపారు. రెండు వారాలు కోమాలో ఉండి చికిత్స పొందిన ఆయన చివరికి కోలుకుని తిరిగి సాధారణ జీవితానికి చేరుకున్నారు.