స్థానిక ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పనిచేయాలని కాకాణి పిలుపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన సర్వేపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.